Read more!

English | Telugu

అక్టోబ‌ర్ నుంచి `యానిమ‌ల్`

`అర్జున్ రెడ్డి` (2017)తో తెలుగునాట సెన్సేష‌న‌ల్ డెబ్యూ ఇచ్చారు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సందీప్ వంగా. క‌ట్ చేస్తే.. అదే సినిమాని `క‌బీర్ సింగ్` (2019) పేరుతో హిందీలో రీమేక్ చేసి అక్క‌డా అదే సెన్సేష‌న్ ని రిపీట్ చేశారు. దీంతో.. సందీప్ థ‌ర్డ్ వెంచ‌ర్ పై ఆస‌క్తి నెల‌కొంది. అందుకు త‌గ్గ‌ట్టే.. బాలీవుడ్ స్టార్ ర‌ణ్ బీర్ క‌పూర్ తో త‌న మూడో సినిమా చేస్తున్నారు సందీప్. `యానిమ‌ల్` పేరుతో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌ణ్ బీర్ కి జంట‌గా ప‌రిణీతి చోప్రా న‌టిస్తుండ‌గా.. కీల‌క పాత్ర‌లో అనిల్ క‌పూర్, శ‌క్తిమంత‌మైన ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో బాబీ డియోల్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. విభిన్న‌మైన గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా  `యానిమ‌ల్` తెర‌కెక్క‌నుంది.

ఇదిలా ఉంటే.. `యానిమ‌ల్`కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ని ఈ ఏడాది అక్టోబ‌ర్ లో ప్రారంభించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఆపై చ‌క‌చ‌కా షూటింగ్ జ‌రిపి 2022 ద‌స‌రాకి సినిమాని విడుద‌ల చేయనున్నారు. ర‌ణ్ బీర్ పాత్ర‌, ఆయ‌న క‌నిపించే విధానం.. `యానిమ‌ల్`కి ప్ర‌ధాన బ‌లంగా నిలుస్తాయ‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, పున‌ర్జ‌న్మ‌ల చుట్టూ ఈ సినిమా క‌థ తిరుగుతుంద‌ని బ‌జ్. మ‌రి.. `యానిమ‌ల్`తో సందీప్ వంగా హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి.